అపురూపమైన, అరుదైన ఎన్టీఆర్ సినీ, రాజకీయ సాహిత్య గ్రంధాలు:
తెలుగునాట, అదేవిధంగా భారతదేశ రాజకీయాలలో నందమూరి తారక రామారావు గారిది ఓ విశిష్ట పంథా! దేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా కొన్ని పుటలు లిఖించుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 3500 కిలోమిటర్లు చైతన్యరథంపై పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా.. కంగుమనే కంఠంతో, ధీర గంభీర స్వరంతో తెలుగు ప్రజల్ని చైతన్యపర్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని వారికి గుర్తు చేశారు. ఆయన ప్రసంగాలు ప్రజల్ని ఉర్రూతలూగించాయి, ఆలోచింపజేశాయి, కార్యోన్ముఖుల్ని చేశాయి. ఆయన ‘తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలి రా!’ అనే పిలుపునిస్తే అది ప్రభంజనమైంది. తెలుగుదేశం సృష్టించిన ఉప్పెనలో వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ కూకటివేళ్లతో సహా కుప్పకూలింది.
ఎన్ .టి .ఆర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన శాసన సభలో చేసిన ప్రసంగాలు, బయట చేసిన చారిత్రక ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ,సినిమా , రాజకీయ రంగంలో రామారావు గారి మహోన్నత వ్యక్తిత్వం , తెలుగు జాతి కి ఆయన తెచ్చిన గుర్తింపు , గౌరవం , ప్రవేశపెట్టిన పథకాలు, అసమాన సామాజిక సేవ గురించి 'శకపురుషుడు ' అనే ప్రత్యేక సంచికను వెలువరిస్తున్నాము . మహా నటుడు ,ప్రజాగాయకుడు ఎన్ .టి .ఆర్ జీవితo పై వెలువడుతున్న అపూర్వ పుస్తకాలు. ఆ తరానికి , ఈ తరానికి వెలలేని కానుకలు
మీ ప్రీ ఆర్డర్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ, హైదరాబాద్.