అపురూపమైన, అరుదైన ఎన్టీఆర్ సినీ, రాజకీయ సాహిత్య గ్రంధాలు:
తెలుగునాట, అదేవిధంగా భారతదేశ రాజకీయాలలో నందమూరి తారక రామారావు గారిది ఓ విశిష్ట పంథా! దేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా కొన్ని పుటలు లిఖించుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 3500 కిలోమిటర్లు చైతన్యరథంపై పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా.. కంగుమనే కంఠంతో, ధీర గంభీర స్వరంతో తెలుగు ప్రజల్ని చైతన్యపర్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని వారికి గుర్తు చేశారు. ఆయన ప్రసంగాలు ప్రజల్ని ఉర్రూతలూగించాయి, ఆలోచింపజేశాయి, కార్యోన్ముఖుల్ని చేశాయి. ఆయన ‘తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలి రా!’ అనే పిలుపునిస్తే అది ప్రభంజనమైంది. తెలుగుదేశం సృష్టించిన ఉప్పెనలో వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ కూకటివేళ్లతో సహా కుప్పకూలింది.
“ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్టీఆర్ అసెంబ్లీలో హుందాగా వ్యవహరించిన తీరు, చేసిన ప్రసంగాలు ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపంగా నిలిచాయి. ఎన్టీఆర్ ప్రతి అంశాన్ని అసెంబ్లీలో సూటిగా, స్పష్టంగా మాట్లాడారు. ఎటువంటి శషబిషలు లేకుండా చెప్పదలుచుకొన్న విషయాన్ని ప్రజల గుండెలకు హత్తుకునేటట్లు చెప్పారు.”
“ఎన్టీఆర్ ప్రసంగాలు గంగా ప్రవాహంలా సాగాయి. అందులోని ప్రతి పదంలో అచ్చమైన తెలుగు భాష, గాఢమైన భావధారన అదేవిధంగా ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం, బోళాతనం, ఆత్మీయత, పేద ప్రజల పట్ల తనకున్న అభిమానం ఆయన ప్రసంగాల్లో ప్రతిఫలించాయి. ఎన్టీఆర్ ఆలోచనలు, విధానాలు, సిద్ధాంతాలు మాత్రమేకాక.. ఎన్టీఆర్ అనుసరించిన అనితర సాధ్యమైన మార్గానికి ఈ ప్రసంగాలు అద్దంపడతాయి.”
“ఎన్టీఆర్ రాజకీయతత్త్వాన్ని (ఇజాన్ని) ఈ ప్రసంగాలు సంపూర్ణంగా ఆవిష్కరించాయి.”
“ఎన్టీఆర్ కొత్త రాజకీయ పదసంపద సృష్టించడమేకాదు.. రాజకీయ నిర్వచనం మార్చడం ఈ ప్రసంగాలలో ప్రస్ఫుటం అవుతుంది.”
“ఈ రెండు గ్రంధాలను ఎన్టీఆర్ను అభిమానించేవారు, ఎన్టీఆర్ గురుంచి తెలుసుకోవాలనుకొనేవారు కచ్చితంగా చదవాలి. చిరకాలం భద్రపర్చుకోవాలి.”
“ఇక, ఎన్టీఆర్పై ప్రత్యేకంగా వెలువరించిన ‘శకపురుషుడు’ ప్రత్యేక సంచిక ఆయన జీవితంలోని రెండు అధ్యాయాలు సినీరంగం, రాజకీయ రంగంలోని ఆయన సమకాలీనులు, ఆప్తులు, స్నేహితులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు స్వయంగా రాసిన భిన్న అభిప్రాయాల అక్షరాల సంగమం. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే అరుదైన సమగ్ర గ్రంథం.”
“ఈ 3 గ్రంథాలు చరిత్ర, సమకాలీన రాజకీయాలు అధ్యయనం చేసేవారికి, అర్ధం చేసుకొనేవారికి అపురూప కానుకలు! ”
వెంటనే మీ కాపీలు రిజర్వు చేసుకోండి. ఎన్టీఆర్ గ్రంథాలతో మీ లైబ్రరీని పరిపుష్టం చేయండి.
ఎన్ .టి .ఆర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన శాసన సభలో చేసిన ప్రసంగాలు, బయట చేసిన చారిత్రక ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ,సినిమా , రాజకీయ రంగంలో రామారావు గారి మహోన్నత వ్యక్తిత్వం , తెలుగు జాతి కి ఆయన తెచ్చిన గుర్తింపు , గౌరవం , ప్రవేశపెట్టిన పథకాలు, అసమాన సామాజిక సేవ గురించి 'శకపురుషుడు ' అనే ప్రత్యేక సంచికను వెలువరిస్తున్నాము . మహా నటుడు ,ప్రజాగాయకుడు ఎన్ .టి .ఆర్ జీవితo పై వెలువడుతున్న అపూర్వ పుస్తకాలు. ఆ తరానికి , ఈ తరానికి వెలలేని కానుకలు
మీ ప్రీ ఆర్డర్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ, హైదరాబాద్.